¡Sorpréndeme!

Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

2025-04-21 0 Dailymotion

 బేసిక్ గా ఈ రోజు ఏదో ఇరగదీసేయాలనే థాట్ ప్రాసెస్ తో రాడు. దొరికినన్ని రాబట్టాలి అవేమన్నా టీమ్ కి హెల్ప్ అవ్వాలి. టీమిండియాకు ఆడినా, ముంబై ఇండియన్స్ కి ఆడినా సేమ్ థాట్ ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ లో ఒక్కోసారి ఎంతెలా శివాలెత్తుతాడంటే ఇక ఆ స్పీడ్ ఆపడం ఎవ్వడి తరం కాదు. 43ఏళ్ల వయస్సు దాదాపు 20 ఏళ్లుగా రకరకాలుగా ఫార్మాట్స్ కి కెప్టెన్ గా చేసి తలపండిన ధోనీ అనుభమైనా సరే ఆ దూకుడు చిన్న బోతుంది. 38ఏళ్ల వయస్సు తనకూ వచ్చిందని మర్చిపోతాడు. ఏ బౌలర్ అయినా సరే తనను అవుట్ చేయాలంటే ఫస్ట్ 3-4 ఓవర్లలో ట్రై చేసుకోవచ్చు. కావల్సినన్ని ఛాన్సులు కూడా ఇస్తాడు. బట్ అది దాటిందా ఎవ్వడు ఆపినా ఆగడు. ఒంటి మీద షర్ట్ తడిచిందా ఇక బౌలర్లకు చుక్కలు చూపించటం స్టార్ట్ చేస్తున్నాడని అర్థం. పేరు తెలుసుగా రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ కి ఐదు సార్లు ట్రోఫీలు అందించిన అధినాయకుడు. ప్రస్తుతం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సీజన్ ను డకౌట్ తో మొదలుపెట్టాడు. ఆరు మ్యాచుల్లో ఆడిన హయ్యెస్ట్ స్కోరు 26. అలాంటి తన సొంతగడ్డ ముంబై వాంఖడే స్టేడియంలో చెన్నైపై మ్యాచ్ అనగానే శివాలెత్తిపోయాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76పరుగులు చేసి నాటౌట్ గా నిలవటమే కాదు. కళ్లు చెదిరిపోయే పుల్ షాట్స్ ఆడుతూ వాటిని సిక్సర్లు మలుస్తూ ఫ్యాన్స్ కి అయితే విందు భోజనం పెట్టేశాడు. తను ఫామ్ లో ఉంటే ఎంత భయానకంగా ఉంటుందో చూపిస్తూ ఒక్కో చెన్నై బౌలర్ ను చావ బాదుడు బాదాడు. ధోనీ ప్లాన్స్ వేస్ట్..సీఎస్కే టార్గెట్స్ వేస్ట్..వేసేది పతిరానా కానీ రవిచంద్రన్ అశ్విన్ కానీ..ఎవ్వడి కోసం ఆలోచించేది లేదు ఎవ్వడినీ వదిలిపెట్టేది లేదన్నట్లు ఆడి తన ఫామ్ ను ఘనంగా చాటుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి కూడా బ్యాట్ చూపించాడంటే అర్థం చేసుకోవచ్చు ఓ హాఫ్ సెంచరీ కోసం ఎంత ఆర్తితో ఎదురు చూశాడో. అందుకే ఆ అద్భుతమైన ఆట తీరుకు పదోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మోకరిల్లింది. లీగ్ లో విరాట్ కొహ్లీ తర్వాత అత్యధిక ఐపీఎల్ పరుగులు చేసిన ఆటగాడిగానూ చరిత్ర సృష్టించిన రోహిత్...మ్యాచ్ మ్యాచ్ కు తన స్కోరు పెంచుకుంటూ కీలకమైన సందర్భంలో ఫామ్ లోకి వచ్చి ముంబై ఇండియన్స్ కి కొండంత అండగా నిలబడ్డాడు.